రంగారెడ్డి మహిళల జట్టుకు టైటిల్‌ | Rangareddy Women's Team Wins Kho Kho Title | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి మహిళల జట్టుకు టైటిల్‌

Nov 26 2019 9:58 AM | Updated on Nov 26 2019 9:58 AM

Rangareddy Women's Team Wins Kho Kho Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా మహిళల జట్టు సత్తా చాటింది. మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోరీ్నలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లో రంగారెడ్డి 11–9తో కరీంనగర్‌పై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మహబూబ్‌నగర్‌ 8–5తో వరంగల్‌పై నెగ్గింది.

పురుషుల విభాగంలో వరంగల్‌  చాంపియన్‌గా నిలిచింది. తుదిపోరులో వరంగల్‌ 11–8తో కరీంనగర్‌ను ఓడించింది. రంగారెడ్డి 9–7తో హైదరాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ములుగు అదనపు ఎస్పీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement