విజేత రంగారెడ్డి | Rangareddy district won under-14 school cricket championship | Sakshi
Sakshi News home page

విజేత రంగారెడ్డి

Sep 20 2013 11:39 PM | Updated on Sep 1 2017 10:53 PM

రాష్ట్ర అండర్-14 బాలుర స్కూల్స్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో విక్టోరియా హోమ్ స్కూల్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ఆరు వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర అండర్-14 బాలుర స్కూల్స్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో విక్టోరియా హోమ్ స్కూల్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ఆరు వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు 11 ఓవర్లలో 22 పరుగులకు అలౌట్ అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు కేవలం 6.2 ఓవర్లలో 25 పరుగులు చేసి విజయం సాధించింది. విజేతలకు రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.మల్లారెడ్డి, జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడు రాఘవ రెడ్డి, స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఈ టోర్నీ పర్యవేక్షకులు బి.ఎం.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
 
 రాష్ట్ర స్కూల్స్ క్రికెట్ జట్టు:
 జాతీయ అండర్-14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర స్కూల్ జట్టును ప్రకటించారు. ఈ పోటీలు వచ్చే నెల 1నుంచి 5 దాకా శ్రీనగర్‌లో జరుగుతాయి.
 రాష్ట్ర అండర్-14 క్రికెట్ జట్టు: ప్రతీక్ రెడ్డి, డి.కళ్యాణ్, నితేష్‌రెడ్డి, కౌశిక్ రెడ్డి, సిద్దార్థ రాజు(రంగారెడ్డి), గౌరవ రెడ్డి, అబ్దుల్ వహీద్, సత్య సాయి (హైదరాబాద్), కిరణ్ పాల్ , అనీష్ కుమార్ , హిమతేజ (ఆదిలాబాద్), టి.వి.సాయి పవన్, టి.అరుణ్ కుమార్(మహబూబ్‌నగర్), చైతన్య తేజ (చిత్తూరు), ఎ.ఆశిష్(ఖమ్మం), రుత్విక్ (కరీంనగర్).
 

Advertisement
 
Advertisement
Advertisement