breaking news
Rangareddy district team
-
ఎస్జీఎఫ్ బాలికల క్రికెట్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. లయోలా జూనియర్ కాలేజిలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ బాలికల జట్టు 10 పరుగుల తేడాతో రంగారెడ్డిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తర్వాత 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి జిల్లా జట్టు 11.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. రంగారెడ్డి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా, ఖమ్మంకు మూడో స్థానం లభించింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం 3 వికెట్ల తేడాతో వరంగల్‌ను ఓడించింది. తొలుత వరంగల్ 12 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా, ఖమ్మం 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోరుు 63 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఖమ్మం కాంస్య పతకం గెలుపొందింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అండర్-19 ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.హనుమంత్ రెడ్డి విజేతలకు పతకాలు అందజేశారు. -
రంగారెడ్డి జిల్లాకు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. మంచిర్యాలలోని రామకృష్ణాపురం ఠాగూర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 1-0 స్కోరుతో విశాఖపట్నంపై విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా జట్టు తరఫున స్ట్రయికర్ శశాంక్ 55వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టు 3-1 స్కోరుతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది. రెండో సెమీఫైనల్లో విశాఖపట్నం 1-0తో నెల్లూరుపై నెగ్గింది. -
విజేత రంగారెడ్డి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర అండర్-14 బాలుర స్కూల్స్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో విక్టోరియా హోమ్ స్కూల్లో శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ఆరు వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు 11 ఓవర్లలో 22 పరుగులకు అలౌట్ అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు కేవలం 6.2 ఓవర్లలో 25 పరుగులు చేసి విజయం సాధించింది. విజేతలకు రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.మల్లారెడ్డి, జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడు రాఘవ రెడ్డి, స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఈ టోర్నీ పర్యవేక్షకులు బి.ఎం.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్కూల్స్ క్రికెట్ జట్టు: జాతీయ అండర్-14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర స్కూల్ జట్టును ప్రకటించారు. ఈ పోటీలు వచ్చే నెల 1నుంచి 5 దాకా శ్రీనగర్‌లో జరుగుతాయి. రాష్ట్ర అండర్-14 క్రికెట్ జట్టు: ప్రతీక్ రెడ్డి, డి.కళ్యాణ్, నితేష్‌రెడ్డి, కౌశిక్ రెడ్డి, సిద్దార్థ రాజు(రంగారెడ్డి), గౌరవ రెడ్డి, అబ్దుల్ వహీద్, సత్య సాయి (హైదరాబాద్), కిరణ్ పాల్ , అనీష్ కుమార్ , హిమతేజ (ఆదిలాబాద్), టి.వి.సాయి పవన్, టి.అరుణ్ కుమార్(మహబూబ్‌నగర్), చైతన్య తేజ (చిత్తూరు), ఎ.ఆశిష్(ఖమ్మం), రుత్విక్ (కరీంనగర్).