ఎస్‌జీఎఫ్ బాలికల క్రికెట్ చాంప్ హైదరాబాద్
మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తర్వాత 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి జిల్లా జట్టు 11.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది.
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌జీఎఫ్) అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. లయోలా జూనియర్ కాలేజిలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ బాలికల జట్టు 10 పరుగుల తేడాతో రంగారెడ్డిపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తర్వాత 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి జిల్లా జట్టు 11.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది.
రంగారెడ్డి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా, ఖమ్మంకు మూడో స్థానం లభించింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం 3 వికెట్ల తేడాతో వరంగల్‌ను ఓడించింది.
తొలుత వరంగల్ 12 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా, ఖమ్మం 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోరుు 63 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఖమ్మం కాంస్య పతకం గెలుపొందింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అండర్-19 ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.హనుమంత్ రెడ్డి విజేతలకు పతకాలు అందజేశారు.