breaking news
cricket championship
-
భారత్ ఘనవిజయం
331 పరుగులతో బంగ్లాదేశ్ ఓటమి ∙ ఆసియా బధిర క్రికెట్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: ఆసియా బధిర క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్థానిక జింఖానా గ్రౌండ్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 331 పరుగులతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌లో అభిషేక్ సింగ్ (72 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విజృంభించగా... తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. టాస్ గెలిచిన భారత్ తొలుత 48.3 ఓవర్లలో 396 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ సింగ్‌తో పాటు ఓపెనర్లు ఇంద్రజిత్ యాదవ్ (53), విపుల్ పటేల్ (49) రాణించారు. సుజీత్ (44) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఇఫ్తికర్, మునీర్ సోహెల్ చెరో 4 వికెట్లను పడగొట్టగా... పయెల్, షహాదత్లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం 397 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూలింది. పయెల్ (15) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేర్ 4 వికెట్లతో ఆకట్టుకోగా... సుజీత్, మన్ను చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. గుర్ప్రీత్ ఒక వికెట్ పడగొట్టాడు. మంగళవారం జరిగిన తొలిమ్యాచ్‌లో భారత్ 288 పరుగుల తేడాతో నేపాల్‌పై గెలుపొందింది. అభిషేక్ సింగ్ (95 బంతుల్లో 156 నాటౌట్; 24 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 41 ఓవర్లలో 7 వికెట్లకు 347 పరుగులు చేయగా... నేపాల్ కేవలం 59 పరుగులకే ఆలౌటై ఘోరంగా ఓడిపోయింది. -
విజేత రంగారెడ్డి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర అండర్-14 బాలుర స్కూల్స్ క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో విక్టోరియా హోమ్ స్కూల్లో శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ఆరు వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు 11 ఓవర్లలో 22 పరుగులకు అలౌట్ అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు కేవలం 6.2 ఓవర్లలో 25 పరుగులు చేసి విజయం సాధించింది. విజేతలకు రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.మల్లారెడ్డి, జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడు రాఘవ రెడ్డి, స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఈ టోర్నీ పర్యవేక్షకులు బి.ఎం.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్కూల్స్ క్రికెట్ జట్టు: జాతీయ అండర్-14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర స్కూల్ జట్టును ప్రకటించారు. ఈ పోటీలు వచ్చే నెల 1నుంచి 5 దాకా శ్రీనగర్‌లో జరుగుతాయి. రాష్ట్ర అండర్-14 క్రికెట్ జట్టు: ప్రతీక్ రెడ్డి, డి.కళ్యాణ్, నితేష్‌రెడ్డి, కౌశిక్ రెడ్డి, సిద్దార్థ రాజు(రంగారెడ్డి), గౌరవ రెడ్డి, అబ్దుల్ వహీద్, సత్య సాయి (హైదరాబాద్), కిరణ్ పాల్ , అనీష్ కుమార్ , హిమతేజ (ఆదిలాబాద్), టి.వి.సాయి పవన్, టి.అరుణ్ కుమార్(మహబూబ్‌నగర్), చైతన్య తేజ (చిత్తూరు), ఎ.ఆశిష్(ఖమ్మం), రుత్విక్ (కరీంనగర్).