రాకేశ్‌కు రెండు పతకాలు | Rakesh Gets Two Medals in Taekwondo Championship | Sakshi
Sakshi News home page

రాకేశ్‌కు రెండు పతకాలు

Jun 22 2019 1:58 PM | Updated on Jun 22 2019 1:58 PM

Rakesh Gets Two Medals in Taekwondo Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొన్మన్‌ రాకేశ్‌ రెండు పతకాలు సాధించాడు. లక్నోలో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో రాకేశ్‌ –74 కేజీల విభాగంలో కాంస్యం... పోమ్సె డెమో ఈవెంట్‌లో రజతం సాధించాడు. ఈ రెండు పతకాలతోపాటు రాకేశ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. భారత తైక్వాండో సమాఖ్య సెక్రటరీ జనరల్‌ జిమ్మీ జగ్తియాని, కోశాధికారి సుధీర్, తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు బాలరాజు చేతుల మీదుగా రాకేశ్‌ పతకాలను అందుకున్నాడు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement