అమ్మకానికి  రాజస్తాన్‌ రాయల్స్‌!

Rajasthan Royals ownership is ready to sell half the stake - Sakshi

నిర్ధారించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యం సగం వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని లీగ్‌ పాలక మండలికి, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తెలిపింది. వాటా విక్రయం తెలియగానే పలువురు బడా పారిశ్రామికవేత్తలు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రాయల్స్‌లో ప్రధాన యజమాని అయిన మనోజ్‌ బదాలే వాటాల విక్రయం నిజమేనని వెల్లడించారు. దీన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ధ్రువీకరించారు. గతంలో రాయల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండేళ్లు నిషేధానికి గురైనపుడు రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో లీగ్‌లో ప్రవేశించిన పారిశ్రామికవేత్త సంజీవ్‌ గోయెంకా ఇప్పుడు రాయల్స్‌ వాటాతో లీగ్‌లో పునరాగమనం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో అట్లెటికో డి కోల్‌కతా జట్టును కలిగివున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top