శ్రీవారికి సింధు తులాభారం... | pv sindhu visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారికి సింధు తులాభారం...

Sep 5 2016 12:35 AM | Updated on Sep 4 2017 12:18 PM

శ్రీవారికి సింధు తులాభారం...

శ్రీవారికి సింధు తులాభారం...

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు...

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సింధు 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. గోపీచంద్ తలనీలాలు సమర్పించారు.

తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధు రాగా, సతీమణి పీవీవీ లక్ష్మీతో కలిసి పుల్లెల గోపీచంద్ ఆలయానికి వచ్చారు. వీరి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. - సాక్షి, తిరుమల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement