క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధూ | PV Sindhu Stuns Olympic Champion Li Xuerui to Enter World Badminton Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధూ

Aug 13 2015 12:39 PM | Updated on Sep 3 2017 7:23 AM

క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధూ

క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధూ

భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

జకర్తా: భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి లీ ఝురయ్పై 21-17, 14-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధూ కెరీర్ లో ఇది ఆమెకు అతిపెద్ద విజయం. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో 11వ సీడ్ ప్లేయర్ సింధూ తొలి, మూడో సెట్లను అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.

గత రెండు చాంపియన్షిప్ లలో కాంస్య పతకాలు సాధించిన సింధూ ఈ ఏడాది కూడా పతకం నెగ్గాలనే ధీమాతో ప్రత్యర్ధులను ఎదుర్కొంటుంది. క్వార్టర్స్ మ్యాచ్ గెలిస్తే ఆ తర్వాత  సింధూకు కష్టమైన డ్రా ఎదురయ్యే అవకాశముంది. స్పెయిన్ కు చెందిన క్రీడాకారిణి టాప్ సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ కరోలినా మరిన్ లేదా చైనాకు చెందిన ప్లేయర్ వాంగ్ షిగ్జేయిన్ తో తలపడాల్సి వస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement