విరాట్, పుజారా 'మారలేదు' | Pujara, Kohli unchanged in Test rankings | Sakshi
Sakshi News home page

విరాట్, పుజారా 'మారలేదు'

Aug 31 2017 3:25 PM | Updated on Sep 17 2017 6:12 PM

విరాట్, పుజారా 'మారలేదు'

విరాట్, పుజారా 'మారలేదు'

అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానంలోనే కొనసాగుతున్నారు.

దుబాయ్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లి ఐదో ర్యాంకును నిలబెట్టుకోగా, చతేశ్వర్ పుజారా కూడా తన గత నాల్గో ర్యాంకును పదిలంగా ఉంచుకున్నారు. కాగా, భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పదోస్థానానికి పడిపోయారు. ప్రస్తుతం పుజారా 876 రేటింగ్ పాయింట్లతో నాల్గో స్థానంలో ఉండగా, కోహ్లి 806 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక రాహుల్ 761 రేటింగ్ పాయింట్లతో టాప్-10 లో నిలిచారు.

తాజా ర్యాంకింగ్స్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(938 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా, జో రూట్(902) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కేన్ విలియమ్సన్(880) మూడో స్థానంలో నిలిచాడు.ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా టాప్ ను నిలబెట్టుకోగా, అశ్విన్ మూడో స్థానాన్ని ఆక్రమించారు.

Advertisement
 
Advertisement
Advertisement