ప్లే ఆఫ్స్‌కు చేరువగా ముంబా | Pro Kabaddi League 2019 U Mumba Closer To Playoff | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్స్‌కు చేరువగా ముంబా

Oct 1 2019 9:31 AM | Updated on Oct 1 2019 9:31 AM

Pro Kabaddi League 2019 U Mumba Closer To Playoff - Sakshi

పంచకుల: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు యు ముంబా మరింత చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ ముంబా 36–32తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. దీంతో 59 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై రైడర్‌ అభిషేక్‌ సింగ్‌ సూపర్‌ ‘టెన్‌’తో ఆకట్టుకున్నాడు. తలైవాస్‌ రైడర్‌ అజిత్‌ (16 పాయింట్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యు ముంబాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో... ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ 42–33తో దబంగ్‌ ఢిల్లీపై నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement