మళ్లీ గెలిచిన ప్రియాంక | Priyanka to win again | Sakshi
Sakshi News home page

మళ్లీ గెలిచిన ప్రియాంక

Sep 9 2013 3:24 AM | Updated on Sep 1 2017 10:33 PM

జాతీయ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ నూతక్కి ప్రియాంక జోరు కొనసాగుతోంది. ప్రపంచ అండర్-10 చాంపియన్ అయిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి టైటిల్ వేటలో ముందడుగు వేసింది.

ఢిల్లీ: జాతీయ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ నూతక్కి ప్రియాంక జోరు కొనసాగుతోంది. ప్రపంచ అండర్-10 చాంపియన్ అయిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి టైటిల్ వేటలో ముందడుగు వేసింది. లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం బాలికల విభాగంలో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ప్రియాంక మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్‌ముఖ్ (6.5)ను ఓడించింది. ఆరంభం నుంచి చక్కని ఎత్తులు వేసిన ఏపీ అమ్మాయి 69 ఎత్తుల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
 
 తాజా విజయంతో ఆమె 8 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా, వంతిక అగర్వాల్ (ఢిల్లీ), సాలొనికా సైనా (ఒడిశా) 7 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలున్నా ఈ టోర్నీలో ప్రియాంక ఒక్క విజయం సాధించినా టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మిగతా ఏపీ క్రీడాకారిణిల్లో కళ్యాణి (5.5)కి రిద్ధి జంట్యే (గోవా, 6.5) చేతిలో చుక్కెదురవగా, మౌనిక అక్షయ (6.5)... రాష్ట్రానికే చెందిన అన్విత (5.5)పై గెలిచింది. జిషిత (6)... సాన్య మహేశ్ (ఢిల్లీ, 5)పై విజయం సాధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement