breaking news
national under 11
-
నేటి నుంచి జాతీయ చెస్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్ ఆదివారం విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు. విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్ రేటింగ్‌తో కర్ణాటకకు చెందిన అపార్ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్‌తో ఎత్తులు ప్రారంభించనున్నారు. -
మళ్లీ గెలిచిన ప్రియాంక
ఢిల్లీ: జాతీయ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ నూతక్కి ప్రియాంక జోరు కొనసాగుతోంది. ప్రపంచ అండర్-10 చాంపియన్ అయిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి టైటిల్ వేటలో ముందడుగు వేసింది. లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం బాలికల విభాగంలో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ప్రియాంక మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్‌ముఖ్ (6.5)ను ఓడించింది. ఆరంభం నుంచి చక్కని ఎత్తులు వేసిన ఏపీ అమ్మాయి 69 ఎత్తుల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. తాజా విజయంతో ఆమె 8 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా, వంతిక అగర్వాల్ (ఢిల్లీ), సాలొనికా సైనా (ఒడిశా) 7 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలున్నా ఈ టోర్నీలో ప్రియాంక ఒక్క విజయం సాధించినా టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మిగతా ఏపీ క్రీడాకారిణిల్లో కళ్యాణి (5.5)కి రిద్ధి జంట్యే (గోవా, 6.5) చేతిలో చుక్కెదురవగా, మౌనిక అక్షయ (6.5)... రాష్ట్రానికే చెందిన అన్విత (5.5)పై గెలిచింది. జిషిత (6)... సాన్య మహేశ్ (ఢిల్లీ, 5)పై విజయం సాధించింది.