మనకు సచిన్‌ మళ్లీ దొరికాడు..! | Prithvi Shaw Reminds Sachin Tendulkar in Under-19 World Cup | Sakshi
Sakshi News home page

మనకు సచిన్‌ మళ్లీ దొరికాడు..!

Jan 14 2018 8:59 PM | Updated on Jan 14 2018 8:59 PM

Prithvi Shaw Reminds Sachin Tendulkar in Under-19 World Cup - Sakshi

బే ఓవెల్ : అండర్-19 ప్రపంచ‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ పృథ్వీ షా చెలరేగిపోయాడు. 100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 94 పరుగులు చేసిన పృథ్వీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో అద్భుత షాట్‌ను ఆడి క్రికెట్‌ పండితులను, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అచ్చూ సచిన్‌లానే పృథ్వీ ఆడిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు కామెంటెటర్లను కూడా ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఒక్కొతరానికి ఒక్కొక్కరు పేరుతో సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌, కొహ్లీల సరసన పృథ్వీని కూడా చేర్చుతూ సోషల్‌మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement