స్వింగ్‌ దెబ్బకు కుదేల్‌

 practice match New Zealand won a brilliant victory over India by 6 wickets - Sakshi

చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్‌

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా 179కే ఆలౌట్‌

హడలెత్తించిన బౌల్ట్, నీషమ్‌

ఆరు వికెట్లతో న్యూజిలాండ్‌ విజయం 

ప్రాక్టీస్‌ మ్యాచే కావచ్చు... కానీ ప్రమాద ఘంటిక మోగించింది... పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించవచ్చు... కానీ పదునైన స్వింగ్‌ పని చేస్తే మన పరిస్థితి ఏమిటో చూపించింది... పచ్చికతో నిండిన పిచ్, మేఘావృత వాతావరణంలో పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్, నీషమ్‌ చెలరేగిన వేళ భారత బ్యాటింగ్‌ కుప్పకూలింది.

బౌల్ట్‌ దెబ్బకు 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా మళ్లీ కోలుకోలేకపోయింది. ఫలితంగా తొలి వార్మప్‌ పోరులో న్యూజిలాండ్‌ చేతిలో 6 వికెట్లతో పరాజయం... కనీసం 300 పరుగులు నమోదవుతాయని భావించిన మైదానంలో చివరకు కోహ్లి సేన 179 పరుగులకే పరిమితం కావడం ఆశ్చర్యకరం.   

 లండన్‌: ప్రపంచ కప్‌కు ముందు సన్నాహక సమరాన్ని భారత్‌ పరాజయంతో ప్రారంభించింది. శనివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 39.2 ఓవర్లలోనే 179 పరుగులకు ఆలౌటైంది. పది ఓవర్ల ముందే జట్టు ఇన్నింగ్స్‌ ముగియడం విశేషం. రవీంద్ర జడేజా (50 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

హార్దిక్‌ పాండ్యా (37 బంతుల్లో 30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ (4/33) ప్రత్యర్థిని కుప్పకూల్చగా, నీషమ్‌ (3/26)  రాణించాడు. అనంతరం న్యూజిలాండ్‌ 37.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాస్‌ టేలర్‌ (75 బంతుల్లో 71; 8 ఫోర్లు), విలియమ్సన్‌ (87 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 114 పరు గులు జోడించి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా (4–2–2–1) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.  

ఓపెనర్లు విఫలం...
బౌల్ట్‌ తన తొలి మూడు ఓవర్లలో ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టి భారత్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన తొలి బంతిని ఆడలేకపోయిన రోహిత్‌ శర్మ (6 బంతుల్లో 2) రెండో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై రోహిత్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. బౌల్ట్‌ తర్వాతి ఓవర్లో లోపలికి దూసుకొచ్చిన బంతిని ఆడలేక శిఖర్‌ ధావన్‌ (7 బంతుల్లో 2) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విజయ్‌ శంకర్, కేదార్‌ జాదవ్‌ గాయాలతో బాధపడుతుండటంతో నాలుగో స్థానంలో సత్తా చాటేందుకు మంచి అవకాశం లభించిన కేఎల్‌ రాహుల్‌ (10 బంతుల్లో 6) దానిని వాడుకోలేకపోయాడు. బౌల్ట్‌ బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా పంపబోయి రాహుల్‌ వికెట్లపైకి ఆడుకున్నాడు.

బౌల్డ్‌ అయిన తర్వాత బంతిని తన కాలితో బలంగా తన్నడం అతనిలోని అసహనాన్ని చూపించింది!  కొన్ని చక్కటి షాట్లు ఆడిన విరాట్‌ కోహ్లి (24 బంతుల్లో 18; 3 ఫోర్లు) గ్రాండ్‌హోమ్‌ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో హార్దిక్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అద్భుత బంతితో హార్దిక్‌ను ఔట్‌ చేసిన నీషమ్‌...అదే ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ (3 బంతుల్లో 4)ను పెవిలియన్‌ చేర్చాడు. క్రీజ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఎమ్మెస్‌ ధోని (42 బంతుల్లో 17; 1 ఫోర్‌)ని సౌతీ దెబ్బ తీయగా... భువనేశ్వర్‌ (17 బంతుల్లో 1) నిలవలేదు. స్కోరు 115/8గా ఉన్న ఈ దశలో కుల్దీప్‌ యాదవ్‌ (36 బంతుల్లో 19; 2 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. 

ఛేదనలో కివీస్‌ 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా అద్భుత బంతితో మున్రో (3 బంతుల్లో 4)ను ఎల్బీగా ఔట్‌ చేయగా... మార్టిన్‌ గప్టిల్‌ (28 బంతుల్లో 22; 3 ఫోర్లు) వేగంగా ఆడబోయి వెనుదిరిగాడు. టేలర్, విలియమ్సన్‌ భాగస్వామ్యం న్యూజిలాండ్‌ను గెలిపించింది. 3, 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద టేలర్‌ ఇచ్చిన క్యాచ్‌లను చహల్, కార్తీక్‌ వదిలేయగా... 55 పరుగుల వద్ద సునాయాస రనౌట్‌ అవకాశాన్ని పాండ్యా చేజార్చాడు. ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు పాండ్యాతో నాలుగే ఓవర్ల చొప్పున బౌలింగ్‌ చేయించి భారత్‌ సాధ్యమైనంత శ్రమ తగ్గించే ప్రయత్నం చేసింది. భారత్‌ తదుపరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

17-06-2019
Jun 17, 2019, 00:07 IST
ప్రపంచకప్‌లో పాక్‌ది అదే కథ అదే వ్యథ
16-06-2019
Jun 16, 2019, 21:15 IST
మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో ఆరంభపు మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వేసిన తొలి...
16-06-2019
Jun 16, 2019, 20:28 IST
ఏమని చెప్పినా.. ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే.. క్రికెట్‌ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట...
16-06-2019
Jun 16, 2019, 20:09 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
16-06-2019
Jun 16, 2019, 19:54 IST
మాంచెస్టర్‌: పాకిస్థాన్‌ బౌలర్లను చీల్చిచెండాడుతూ రోహిత్‌ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ మంచి సమన్వయంతో...
16-06-2019
Jun 16, 2019, 19:38 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. రోహిత్‌ శర్మ(140; 113 బంతుల్లో 14...
16-06-2019
Jun 16, 2019, 19:11 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కల్గించడంతో కొద్దిసేపు నిలిచిపోయింది. అయితే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌  పునః...
16-06-2019
Jun 16, 2019, 18:32 IST
మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్గించాడు. భారత స్కోరు 46.4...
16-06-2019
Jun 16, 2019, 18:28 IST
మాంచెస్టర్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో...
16-06-2019
Jun 16, 2019, 18:01 IST
మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన...
16-06-2019
Jun 16, 2019, 17:28 IST
మాంచెస్టర్‌: ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-పాకిస్థాన్‌  మ్యాచ్‌కు ముందు టాస్‌ కోసం డ్రెస్సింగ్‌రూమ్‌ నుంచి బయటకు వస్తున్న విరాట్‌ కోహ్లీకి ఘనస్వాగతం...
16-06-2019
Jun 16, 2019, 17:23 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేస్తూ...
16-06-2019
Jun 16, 2019, 16:41 IST
మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. భారత్‌ను...
16-06-2019
Jun 16, 2019, 16:29 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమ వరల్డ్‌కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై అత్యధిక...
16-06-2019
Jun 16, 2019, 16:08 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌​కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. 34 బంతుల్లో 6...
16-06-2019
Jun 16, 2019, 15:49 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌  వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ...
16-06-2019
Jun 16, 2019, 15:15 IST
సాక్షి: క్రికెట్‌ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తున్న భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌​ఖాన్‌ తమ జట్టులో ప్రేరణనింపే ప్రయత్నం చేశారు....
16-06-2019
Jun 16, 2019, 14:41 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తికరమైన భారత్‌-పాకిస్తాన్‌ల మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో...
16-06-2019
Jun 16, 2019, 13:58 IST
అభిమానులు కోరుకున్నట్లుగానే వరణుడు కరుణిస్తున్నట్లున్నాడు..
16-06-2019
Jun 16, 2019, 13:20 IST
మాంచెస్టర్‌ : భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా..!  సగటు క్రికెట్‌ అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది. మాంచెస్టర్‌ వేదికగా మధ్యాహ్నం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top