హామిల్టన్‌కు ‘పోల్’ | Pole to Lewis Hamilton | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌కు ‘పోల్’

Jun 7 2015 1:44 AM | Updated on Aug 21 2018 9:00 PM

ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు.

మాంట్రియల్ : ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 43.393 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్), గ్రోస్యెన్ (విలియమ్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement