ఎప్పుడైతే నీతో ఉన్నానో..: రిషభ్‌

Pant Enjoys New Year Vacations With Girlfriend Isha Negi - Sakshi

ఇషా నేగీతో ప్రేమలో పంత్‌

న్యూఢిల్లీ: ఇటీవల టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ దానికి అందమైన క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ‘ నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం’ అని క్యాప్షన్‌ జోడించాడు. మరి అలా ఎందుకు రాశాడో ఆ సమయంలోనే అందరికీ అర్థమైనప్పటికీ, తాజాగా దాన్ని నిజం చేస్తూ ఇషాను సంతోషంగా ఉంచే పనిలో ఉన్నాడు రిషభ్‌. ఇప్పుడు ఈ జంట విహార యాత్రల్లో మునిగి తేలుతోంది. క్రిస్ట్‌మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా రిషభ్‌-ఇషాల జోడి ప్రేమాయణం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని గర్ల్‌ఫ్రెండ్‌ ఇషాతో గడపడానికి కేటాయించాడు పంత్‌.(ఇక్కడ చదవండి: సెర్బియా నటితో హార్దిక్‌ పాండ్యా నిశ్చితార్థం)

వీరిద్దరూ ఒక మంచు కొండపై షికారు చేస్తూ ఉన్న ఫొటోను ఇద్దరు సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేశారు.  అయితే దీనికి రిషభ్‌ కాస్త భిన్నంగా క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘ ఎప‍్పుడైతే నేను నీతో ఉన్నానో.. అప్పుడు నన్ను నేను బాగా ఇష్టపడుతున్నా’ అని రిషభ్‌ పేర్కొన్నాడు. ఇక ఇషా మాత్రం ఫిఫ్త్‌ ఇయర్‌ అండ్‌ కౌంటింట్‌.. లవ్‌ యూ స్కై బిగ్‌ బబ్బీ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంటే వీరి స్నేహం-ప్రేమ మొదలై సుమారు ఐదేళ్లు అయినట్లే అర్థం అవుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు క్యాప్షన్‌లను కూడా వైవిధ్యంగా పోస్ట్‌ చేయడంతో ప్రేమలో సీరియస్‌గా మునిగి తేలుతున్నట్లు కనబడుతోంది.మరి ఇది డేటింగ్‌ వరకే పరిమితం అవుతుందా.. పెళ్లి పీటల వరకూ వెళుతుందో చూడాలి.(ఇక్కడ చదవండి: ఊర్వశి రౌతేలాతో రిషభ్‌ డేటింగ్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top