బాలీవుడ్‌ భామతో రిషభ్‌ డేటింగ్‌!

Rishabh Dating Bollywood Actress Urvashi Rautela, Rumours Goes Viral - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతూ వస్తున్న యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇప్పుడు ఒక నటితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలాతో పంత్‌ డేటింగ్‌ జరుపుతున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వెస్టిండీస్‌తో మూడో టీ20కి ముందురోజు రాత్రి..  ఊర్వశీ రౌతేలాతో ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో డిన్నర్‌ చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది.

దాంతో ఊర్వశితో అతడు డేటింగ్‌ చేస్తున్నట్టు అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. మరొకవైపు టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను రిషభ్‌ పంత్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం’ అని రిషభ్‌ క్యాప్షన్‌ జోడించాడు. మరి ఇక్కడ ఇషా నేగీతో ఫొటోను రిషభ్‌ పంత్‌ పోస్ట్‌ చేయడమే కాకుండా ఇలా ఎందుకు రాశాడో అతనికే తెలియాలి. వరుస వైఫల్యాలతో సతమవుతున్న  రిషభ్‌ పంత్‌కు ఈ తరహా వ్యవహరాలు అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. విండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో ఫర్వాలేదనిపించిన రిషభ్‌.. ఆఖరి మ్యాచ్‌లో ఫస్ట్‌డౌన్‌లో వచ్చి డకౌట్‌ అయ్యాడు.కేవలం రెండు బంతులే ఆడి పొలార్డ్‌ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top