సెమీస్‌లో పాకిస్తాన్‌ అండర్‌–19 వరల్డ్‌కప్‌  | Pakistan Under-19 World Cup in Semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పాకిస్తాన్‌ అండర్‌–19 వరల్డ్‌కప్‌ 

Jan 25 2018 12:41 AM | Updated on Jan 25 2018 12:41 AM

Pakistan Under-19 World Cup in Semis - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: బౌలర్లు రాణించడంతో పాటు బ్యాటింగ్‌లో అలీ జర్యాబ్‌ (111 బంతుల్లో 74 నాటౌట్‌; 5 ఫోర్లు) అద్భుత ప్రదర్శన చేయడంతో పాకిస్తాన్‌ అండర్‌–19 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు చేరింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ 3 వికెట్లతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేయగా... పాకిస్తాన్‌ 47.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి విజయం సాధించింది. బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య శుక్రవారం జరిగే మరో క్వార్టర్స్‌లో విజయం సాధించిన జట్టుతో పాకిస్తాన్‌  సెమీస్‌లో తలపడనుంది.   

Advertisement
 
Advertisement
Advertisement