భారత జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్‌ ఫ్యాన్స్‌ | Pakistan fans singing indias national anthem | Sakshi
Sakshi News home page

భారత జాతీయ గీతాన్ని ఆలపించిన పాక్‌ ఫ్యాన్స్‌

Sep 21 2018 11:38 AM | Updated on Sep 21 2018 12:09 PM

Pakistan fans singing indias national anthem - Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ను 162 పరుగులకే కట్టడి చేసి, ఆపై విజయాన్ని సునాయాసంగా అందుకుంది. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల సభ్యులు ఫీల్డ్‌లోకి వెళ్లిన తర్వాత తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు.

కాగా, భారత జాతీయ గీతం రన్‌ అవుతున్న సందర్భంలో పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ సైతం అందుకు తమ శృతిని జత చేశారు. పలువురు పాక్‌ అభిమానులు నిలబడి మరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపైభారత జాతీయ పలువురు భారత నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరొకవైపు దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement