ఉత్కంఠభరితంగా సాగిన అండర్-19 ఆసియాకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు రెండు వికెట్ల తేడాతో భారత జట్టుపై నెగ్గింది.
దుబాయ్: ఉత్కంఠభరితంగా సాగిన అండర్-19 ఆసియాకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు రెండు వికెట్ల తేడాతో భారత జట్టుపై నెగ్గింది. కెప్టెన్ సమీ అస్లాం (108) సెంచరీతో చెలరేగడంతో 251 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే పాక్ సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 250 పరుగులు చేసింది. రికీ భుయ్ (64), సంజూ సామ్సన్ (38) రాణించారు. కరామత్ అలీకి నాలుగు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాక్ కుర్రాళ్లు 49.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 253 పరుగులు సాధించారు. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరాయి.