చైనా ఓపెన్‌ క్వార్టర్‌‌సలో సానియా జోడి | Paes, Sania move to quarter-finals of China Open | Sakshi
Sakshi News home page

చైనా ఓపెన్‌ క్వార్టర్‌‌సలో సానియా జోడి

Oct 3 2013 1:06 AM | Updated on Sep 1 2017 11:17 PM

చైనా ఓపెన్‌ క్వార్టర్‌‌సలో సానియా జోడి

చైనా ఓపెన్‌ క్వార్టర్‌‌సలో సానియా జోడి

చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా మీర్జా మహిళల డబుల్‌‌స విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా మీర్జా

బీజింగ్‌: చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సానియా మీర్జా మహిళల డబుల్‌‌స విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్‌ (జింబాబ్వే) ద్వయం 6-3, 6-2తో పావ్లీచెంకోవా (రష్యా)-సఫరోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడిపై గెలిచింది. తదుపరి రౌండ్‌లో సానియా జోడి యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ)-జెంగ్‌ జీ (చైనా) లతో పోటీపడుతుంది. పేస్‌ జోడి కూడా
ఇదే టోర్నీ పురుషుల డబుల్‌‌స విభాగంలో పేస్‌ (భారత్‌)-నెస్టర్‌ (కెనడా) జోడి కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ పేస్‌-నెస్టర్‌ జంట 6-2, 6-2తో జాన్‌ ఇస్నెర్‌-సామ్‌ క్వెరీ (అమెరికా) ద్వయంపై గెలిచింది. 50 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండో-కెనడియన్‌ జోడి రెండు ఏస్‌లు సంధించడంతోపాటు రెండు డబుల్‌ ఫాల్‌‌టలు చేసింది. టోక్యోలో జరుగుతున్న జపాన్‌ ఓపెన్‌లో బోపన్న (భారత్‌)-వాసెలిన్‌ (ఫ్రాన్‌‌స) ద్వయం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో బోపన్న-వాసెలిన్‌ 7-5, 4-6, 10-6తో యువాన్‌ మొనాకో-జెబలాస్‌ (అర్జెంటీనా)లపై గెలిచారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement