'కోహ్లి ఆటపై మాట్లాడటం సరికాదు' | Not Right to Comment on Virat Kohli's Rare Failures, Says Sanjay Bangar | Sakshi
Sakshi News home page

'కోహ్లి ఆటపై మాట్లాడటం సరికాదు'

Mar 7 2017 12:37 PM | Updated on Sep 5 2017 5:27 AM

'కోహ్లి ఆటపై మాట్లాడటం సరికాదు'

'కోహ్లి ఆటపై మాట్లాడటం సరికాదు'

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో విఫలమైనంత మాత్రాన అతని ఆట గురించి పదే పదే చర్చించడం అనవసరమని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో విఫలమైనంత మాత్రాన అతని ఆట గురించి పదే పదే చర్చించడం అనవసరమని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. అతని కెరీర్ లోఒకటి రెండు ఫెయిల్యూర్ ఇన్నింగ్స్ వచ్చినంత మాత్రన అతని బ్యాటింగ్ ను తప్పుపట్టడం సమంజసం కాదన్నాడు.

 

మిగతా మ్యాచ్ ల్లో కోహ్లి గాడిలో పడతాడన్న బంగర్.. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకుని ముందుకు సాగడం విరాట్ నైజం అన్నాడు. భారత్ రెండో్ ఇన్నింగ్స్ లో విరాట్ అవుటైన తీరు తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు.విరాట్ అవుట్ పై కచ్చితత్వం లేకుండా అంపైర్ అవుట్ గా  ప్రకటించిన తీరు నిరుత్సాహానికి గురి చేసిందన్నాడు. ఇలాంటి వికెట్‌పై ఎంత లక్ష్యం సరిపోతుందో తాను చెప్పలేనని బంగర్ పేర్కొన్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement