భారీ నష్టం తప్పదు : సౌరవ్‌ గంగూలీ

Not Hosting IPL Will Cause Loss Of Rs 4000 Crore, Sourav Ganguly - Sakshi

ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలి

ఎంత నిల్వ ఉందో చూడాలి

క్లోజ్డ్‌ డోర్స్‌లో ఆకర్షణ ఉండదు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి విచారం వ్యక్తం చేశాడు. ఈ వైరస్‌ సంక్షోభంతో ప్రపంచమంతా అనేక విధాలుగా నష్టపోతుందన్నాడు. ఇది బీసీసీఐ కూడా పెద్ద దెబ్బేనని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ జరుగుతుందని ఇప్పటివరకూ ఆశిస్తూ వచ్చామని భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేకపోతున్నామన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరగ్గపోతే భారీగా ఆర్ధిక నష్టం వాటిల్లుతుందన్నాడు. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయిలను బీసీసీఐ నష్టపోయే అవకాశం ఉందన్నాడు. ‘ బీసీసీఐ ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలి. బోర్డు దగ్గర ఎంత డబ్బు ఉందో చూడాలి.. దాన్ని బట్టి ముందడుగు వేయాలి. ఒకవేళ ఐపీఎల్‌ జరగ్గపోతే నాలుగు వేల కోట్లు బీసీసీఐ నష్టం. ఇది చాలా పెద్ద మొత్తం’ అని గంగూలీ పేర్కొన్నాడు. (‘ఆ టూర్‌ ఇష్టం లేదు.. కానీ లైఫ్‌ మారిపోయింది’)

ఐపీఎల్‌ జరిగినట్లయితే ఎటువంటి చెల్లింపులు ఉండవని, పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయన్నాడు. ఇక​ ఐపీఎల్‌  మూసి ఉంచిన స్టేడియాల్లో(ప్రేక్షకులకు అనుమతి లేకుండా) నిర్వహిస్తే అంశాన్ని పరిశీలించామన్నాడు. అయితే దానికి ఆకర్షణ తక్కువగా ఉంటుందన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియన్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను చూడండి. అప్పుడు కూడా ఈడెన్‌ గార్డెన్‌లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ నిర్వహించారు. ఫలితంగా ఎటువంటి ఆసక్తిలేకుండా ఆ మ్యాచ్‌ ముగిసింది. పరిమిత సంఖ్యలో జనం ఉండేలా మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ వారు భౌతిక దూరాన్ని పాటించేలా చేయాలి. పోలీసులు కఠినంగా వ్యహరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులతో మ్యాచ్‌లు జరపాలంటే చాలా కష్టం. ఏమి జరుగుతుందో కాలమే సమాధానం చెబుతుంది’ అని గంగూలీ తెలిపాడు.  కరోనా కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబంతోనే గడుపుతున్నా అని ఈ మాజీ కెప్టెన్‌ పేర్కొన్నాడు.(‘ధోని.. మిస్టర్‌ కూల్‌ కాదు’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top