అంపైర్లపై చర్యలుండవ్‌! | Sakshi
Sakshi News home page

అంపైర్లపై చర్యలుండవ్‌!

Published Sat, Mar 30 2019 1:48 AM

No sanctions for umpires despite no-ball controversy - Sakshi

న్యూఢిల్లీ: నోబాల్‌ గుర్తించని అంపైర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్‌లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో సత్వర చర్యలకు బీసీసీఐ వెనుకంజ వేస్తోంది. ముంబై ఇండియన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య గురువారం మ్యాచ్‌ జరిగింది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సివుండగా... మలింగ నోబాల్‌ వేశాడు. కానీ ఫీల్డు అంపైర్‌ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. అతనితో పాటు నందన్‌ ఆ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేశారు.

దీనిపై మ్యాచ్‌ ముగిసిన వెంటనే బెంగళూరు సారథి కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ల పొరపాట్లపై ఆక్షేపించాడు. అయితే తాజా ఐపీఎల్‌లో కేవలం 11 మంది భారత అంపైర్లు, ఆరుగురు విదేశీ అంపైర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 56 మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు కానీ... మ్యాచ్‌ రిఫరీ మను నాయర్‌ అంపైర్‌ రవికి నెగెటివ్‌ మార్క్‌ను వేశారు.   

Advertisement
Advertisement