దక్షిణాఫ్రికా పర్యటనపై అదే అనిశ్చితి! | No decision yet on India's tour to South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా పర్యటనపై అదే అనిశ్చితి!

Oct 13 2013 1:36 AM | Updated on Sep 1 2017 11:36 PM

దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి బీసీసీఐ, క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) అధ్యక్షులు ఎన్.శ్రీనివాసన్, క్రిస్ నెన్‌జానిల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి బీసీసీఐ, క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) అధ్యక్షులు ఎన్.శ్రీనివాసన్, క్రిస్ నెన్‌జానిల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సఫారీ పర్యటనపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
 

 బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో శ్రీనితో పాటు బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్, సీఎస్‌ఏ తరఫున నెన్‌జానీ, స్వతంత్ర డెరైక్టర్ నార్మన్ అర్నెడ్స్‌లు పాల్గొన్నారు. టూర్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై శ్రీనివాసన్ సీఎస్‌ఏ చీఫ్‌కు వివరించి వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ అంశాలను తమ సభ్యులతో చర్చించి మరికొద్ది రోజుల్లో బీసీసీఐకి తెలియజేస్తామని నెన్‌జాని స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement