న్యూజిలాండ్ జట్టులో స్పిన్ త్రయం | New Zealand pick spin trio for World T20 | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ జట్టులో స్పిన్ త్రయం

Feb 1 2016 8:34 PM | Updated on Sep 3 2017 4:46 PM

త్వరలో భారత్లో జరగబోయే వరల్డ్ ట్వంటీ 20 కప్ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు దక్కింది.

వెల్లింగ్టన్: త్వరలో భారత్లో జరగబోయే వరల్డ్ ట్వంటీ 20 కప్ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు దక్కింది.  భారత్ లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్పిన్ త్రయానికి అవకాశం కల్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆఫ్ స్పిన్నర్ నాథన్ మెకల్లమ్ తో పాటు, లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీ,  లెఫ్టార్మ్  స్పిన్నర్ మిచెల్ సాంట్నార్ లకు అవకాశం కల్పించింది.  ఈ మేరకు సోమవారం 15 సభ్యులతో కూడిన జట్టును కివీస్ ప్రకటించింది.

న్యూజిలాండ్ వరల్డ్ టీ 20 జట్టు

కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, హేన్నీ నికోలస్, గ్రాంట్ ఎలియాట్, కోరీ అండర్సన్, కోలిన్ మున్రో, లూక్ రోంచీ, మిచెల్ సాంట్నార్, నాథన్ మెకల్లమ్, టిమ్ సౌతీ, ట్రెంట్ బోల్ట్, మిచెల్ మెక్ లాన్గన్, ఆడమ్ మిల్నీ, ఇష్ సోథీ

Advertisement
 
Advertisement
Advertisement