రెండో టెస్టు: న్యూజిలాండ్కు షాక్ | New Zealand captain Kane Williamson ruled out of Kolkata Test | Sakshi
Sakshi News home page

రెండో టెస్టు: న్యూజిలాండ్కు షాక్

Sep 30 2016 9:56 AM | Updated on Sep 4 2017 3:39 PM

రెండో టెస్టు: న్యూజిలాండ్కు షాక్

రెండో టెస్టు: న్యూజిలాండ్కు షాక్

భారత్తో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన న్యూజిలాండ్కు రెండో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది.

కోల్కతా: భారత్తో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన న్యూజిలాండ్కు రెండో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతాలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్కు న‍్యూజిలాండ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్మన్ విలియమ్సన్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన కివీస్కు.. విలియమ్సన్ కూడా దూరమవడం పెద్ద సమస్యే. మ్యాచ్ సమయానికి విలియమ్సన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశించినా నిరాశే ఎదురైంది. కోల్కతా టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్గా రాస్ టేలర్ను నియమించారు.

శుక్రవారం కోల్కతాలో ఆరంభమైన రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టెస్టులో సిరీస్లో విరాట్ కోహ్లీ సేన 1-0తో ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. కాన్పూర్లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement