breaking news
Captain Kane Williamson
-
విలియమ్సన్ సెంచరీ
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 341∙ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 38/1 డ్యునెడిన్: కెప్టెన్ కేన్ విలియమ్సన్ (241 బంతుల్లో 130; 18 ఫోర్లు) సెంచరీ సహాయంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 144.3 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వాట్లింగ్ (128 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రొటీస్‌పై కివీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. కేశవ్ మహరాజ్‌కు ఐదు... ఫిలాండర్, మోర్కెల్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. క్రీజులో ఎల్గర్ (12 బ్యాటింగ్), ఆమ్లా (23 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం ప్రొటీస్ 5 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటలో అలారం అలజడి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో స్టేడియంలోని గ్రాండ్‌స్టాండ్ నుంచి ఫైర్ అలారం మోగడంతో 20 నిమిషాలపాటు ఆటకు అంతరాయం కలిగింది. ఈ హఠాత్పరిణామంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే రంగప్రవేశం చేసిన అగ్నిమాపక సిబ్బంది ముందుగా మైదానంలోని గడ్డిని నీటితో తడిపేశారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు, మ్యాచ్ రిఫరీ, అంపైర్లు స్టేడియం మధ్యలోకి చేరుకోగా ప్రేక్షకులను బయటికి పంపేశారు. అయితే అలారం ఎందుకు మోగిందనే కారణం ఎవరికీ అంతుపట్టకపోవడంతో చివరికి ఆటను కొనసాగించారు. -
రెండో టెస్టు: న్యూజిలాండ్‌కు షాక్
కోల్‌కతా: భారత్‌తో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన న్యూజిలాండ్‌కు రెండో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన కివీస్‌కు.. విలియమ్సన్ కూడా దూరమవడం పెద్ద సమస్యే. మ్యాచ్ సమయానికి విలియమ్సన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశించినా నిరాశే ఎదురైంది. కోల్‌కతా టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా రాస్ టేలర్‌ను నియమించారు. శుక్రవారం కోల్‌కతాలో ఆరంభమైన రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టెస్టులో సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన 1-0తో ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది.