జాతీయ రగ్బీ టోర్నీ షురూ | national rugby tourney started in hyderabad | Sakshi
Sakshi News home page

జాతీయ రగ్బీ టోర్నీ షురూ

Feb 8 2018 10:37 AM | Updated on Sep 4 2018 5:37 PM

national rugby tourney started in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరం మరో జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. భా రత స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) రగ్బీ జాతీయ చాంపియన్‌షిప్‌ బుధవారం ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు.

మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన జట్లు ఇందులో తలపడుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆసియా రగ్బీ చాంపియన్‌షిప్‌ను కూడా నగరంలో నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement