ఓ విద్యార్థి చేసిన చిలిపి పనే.. ఈ ఆటకి ఆరంభమని తెలుసా? | Origin Of Rugby Game Explained In Telugu, Story Of William Webb Ellis And Rugby School History, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Rugby: ఓ విద్యార్థి చేసిన చిలిపి పనే.. ఈ ఆటకి ఆరంభమని తెలుసా?

Jun 16 2026 2:23 PM | Updated on Jun 16 2026 3:49 PM

The Start Of The Game Of Rugby And The Webb Ellis Cup

విలియమ్‌ వెబ్‌ ఎల్లిస్‌ (William Webb Ellis)

19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లోని వివిధ పాఠశాలల్లో ఫుట్‌బాల్‌ ఆటకు కొన్ని వేర్వేరు నియమాలు ఉండేవి. అయితే ఈ నియామాలనే ఆధారం చేసుకుని.. కాస్త రివర్స్‌లో ఏర్పడిందే ఈ రగ్బీ ఆట.

1823వ సంవత్సరంలో రగ్బీ స్కూల్‌ (Rugby School) అనే పాఠశాలలో ఫుట్‌బాల్‌ ఆటను నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో విలియమ్‌ వెబ్‌ ఎల్లిస్‌(William Webb Ellis) అనే 16 ఏళ్ల విద్యార్థి బంతిని చేతులతో ఎత్తుకుని పరిగెత్తాడు. ఆనాడు ఫుట్‌బాల్‌ నియమాలకు ఇది పూర్తి వ్యతిరేకం. ఆ రోజుల్లో బంతిని కాలుతో తోయడం(కిక్‌) మాత్రమే ఉండేది. 

ఇలా చేతితో తీసుకుని పరిగెత్తిన సంఘటనే రగ్బీ ఆటకు పునాదిగా మారిందని కొందరి అభిప్రాయం. అయితే దీనిపై చరిత్రకారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదనే చెప్పవచ్చు. కానీ స్థానికులు మాత్రం ఆ విద్యార్థి కారణంగానే ఈ ఆట పుట్టుకొచ్చిందని విశ్వసిస్తారు. 


ఆనాడు ఎల్లిస్‌ చేసిన ఈ కొత్త ప్రయోగం అక్కడి విద్యార్థులకి తెగ నచ్చేసింది. 1845లో రగ్బీ స్కూల్‌లోనే విద్యార్థులచే ఈ ఆటకు నియమాలు నిర్ణయించారు. 1871 లో రగ్బీ యూనియన్‌ ఏర్పడి, అధికారిక నియమాలను రూపొందించుకుంది.

ఈ ఆట ఇంగ్లాండ్‌లో పుట్టి, రగ్బీ స్కూల్‌లో మొదలై, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ గా మారింది. ఈ వరల్డ్‌కప్‌ మొదటిసారిగా 1987లో ఎడిన్‌బర్గ్‌లోని రేబర్న్ ప్లేస్‌లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? రగ్బీ ప్రపంచకప్‌ విజేతకు ఇచ్చే ట్రోఫీ పేరు 'విలియమ్‌ వెబ్‌ ఎల్లిస్‌' కప్‌. అంటే ఈ కథలో మొదటిసారిగా ఫుట్‌బాల్‌ ఆటకి వ్యతిరేకంగా బంతిని చేతులలో తీసుకుని పరిగెత్తిన విద్యార్థి పేరే గౌరవార్థంగా పెట్టడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement