జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ : నజీబ్‌కు కాంస్యం | National Open Athletics: Abdul Najeeb | Sakshi
Sakshi News home page

జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ : నజీబ్‌కు కాంస్యం

Sep 9 2013 3:07 AM | Updated on Sep 1 2017 10:33 PM

జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ : నజీబ్‌కు కాంస్యం

జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ : నజీబ్‌కు కాంస్యం

జాతీయ ఓపెన్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు. ఓఎన్‌జీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నజీబ్ ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల రేసును 10.67 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.

రాంచీ: జాతీయ ఓపెన్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు. ఓఎన్‌జీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నజీబ్ ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల రేసును 10.67 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.
 
 అనిరుధ్ (ఎల్‌ఐసీ-10.46 సెకన్లు) స్వర్ణం సాధించగా... సత్య (తమిళనాడు-10.66 సెకన్లు) రజత పతకం సొంతం చేసుకున్నాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో మెర్లిన్ 13 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. సెమీఫైనల్ రేసును ఆమె 11.35 సెకన్లలో పూర్తి చేసి 11.38 సెకన్లతో 2000లో రచితా మిస్త్రీ నెలకొల్పిన జాతీయ రికార్డును తిరగరాసింది. అయితే ఫైనల్స్‌లో మాత్రం మెర్లిన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సంతృప్తి పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement