నైనాకు కాంస్యం | Naina Jaiswal gets bronze medal | Sakshi
Sakshi News home page

నైనాకు కాంస్యం

Jul 16 2018 10:25 AM | Updated on Jul 16 2018 10:25 AM

Naina Jaiswal gets bronze medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌ కాంస్య పతకం సాధించింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన యూత్‌ బాలికల సింగిల్స్‌ సెమీస్‌లో నైనా 12–10, 10–12, 11–4, 11–5, 8–11, 11–13, 10–12తో సెలీనా దీప్తి (తమిళనాడు) చేతిలో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో నైనా 4–3తో వన్షిక భార్గవ్‌ (ఢిల్లీ)పై గెలుపొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement