ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్‌కు చోటు.. జట్ల వివరాలివే! | UTT 2026, Full List Of Sold Players In Ultimate Table Tennis Season 7, Diya Chitale Becomes Costliest Indian Pick | Sakshi
Sakshi News home page

UTT 2026 Updates: ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్‌కు చోటు.. జట్ల వివరాలివే!

Apr 29 2026 12:27 PM | Updated on Apr 29 2026 12:59 PM

UTT 2026: Full-list-of-sold-players-in-ultimate-table-tennis-season-7

ముంబై: అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) 7వ సీజన్‌ వేలం మంగళవారం ఘనంగా ముగిసింది. వేలంలో తెలంగాణ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్‌ను పుణే జాగ్వార్స్‌ జట్టు సొంతం చేసుకుంది. మహిళా ప్యాడ్లర్‌ దియా చిటాలే వేలంలో అత్యధిక విలువ పలికిన భారత ప్లేయర్‌గా నిలిచింది. దియాను కూడా పుణే జట్టు తీసుకుంది. 

ఇతర భారత స్టార్‌ ఆటగాళ్లలో మనుశ్‌ షాను ముంబై, మానవ్‌ ఠక్కర్‌ను యూపీ, మనిక బత్రాను అహ్మదాబాద్‌ టీమ్‌లు ఎంపిక చేసుకున్నాయి. యూటీటీ టోర్నీలో మొత్తం 7 జట్లు పాల్గొంటుండగా... సింగిల్ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో ప్రతీ జట్టు మరో జట్టులో ఒక్కో సారి తలపడుతుంది. టాప్‌–4 టీమ్‌లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. 

జూలై 9 నుంచి 26 వరకు గోవాలో టోర్నమెంట్ నిర్వహిస్తారు. గత సీజన్‌లో జైపూర్‌ పేట్రియాట్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఈసారి బరిలోకి దిగడం లేదు. వెన్ను నొప్పి గాయంతో ఆమె బాధపడుతోంది.

జట్ల వివరాలు:  
అహ్మదాబాద్‌ పైపర్స్‌: మనిక బత్రా, కావ్య భట్, సానిల్‌ శెట్టి, పాయస్‌ జైన్, సోఫియా పల్కనొవా, ఏడ్రియన్‌ రసెన్‌ఫోస్‌. 
దబంగ్‌ ఢిల్లీ: సత్యన్‌ జ్ఞానశేఖరన్, దివ్యాంశి భౌమిక్, సుతీర్ఖ ముఖర్జీ, మారియా గ్జియో, యూసుఫ్‌ అబ్దుల్‌ అజీజ్, రీగన్‌ ఆల్బర్‌క్యూ. 
గోవా చాలెంజర్స్‌: దివ్యాంశ్‌ శ్రీవాత్సవ, అనన్య చండే, పీబీ అభినంద్, బెర్నడ్‌ జాక్స్, సిండ్రెలాడాస్, అల్వరో రాబుల్స్‌. 
కోల్‌కతా థండర్‌ బ్లేడ్స్‌: అంకుర్, ఐహిక ముఖర్జీ, జీత్‌ చంద్ర, తనీషా కొటెచా, ఎడ్వర్డ్‌ లోనెస్కూ, జెంగ్‌ జియాన్‌. 
పుణే జాగ్వార్స్‌: దియా చిటాలే, స్నేహిత్, ముదిత్‌ దాని, సయానిక మాజీ, ప్రీతిక పావడే, ఉమర్‌ అస్సార్‌. 
యు ముంబా: మనుశ్‌ షా, ఆకాశ్‌ పాల్, నిత్యశ్రీ మణి, అనూష కుటుంబలే, అనా హర్సీ, బార్డెట్‌ 
యూపీ ప్రొమిథెయన్స్‌: మానవ్‌ ఠక్కర్, సయాలీ వానీ, సుధాంశు, స్వస్తిక ఘోష్, యాంగ్జీ ల్యూ, రికార్డో వాల్తర్‌.

Advertisement
 
Advertisement
Advertisement