రాణించిన విజయ్,పూజారా | murali vijay, pujara fifties drive india forward | Sakshi
Sakshi News home page

రాణించిన విజయ్,పూజారా

Sep 22 2016 1:13 PM | Updated on Sep 4 2017 2:32 PM

రాణించిన విజయ్,పూజారా

రాణించిన విజయ్,పూజారా

మూడు టెస్టుల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది.

కాన్పూర్:మూడు టెస్టుల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 42 పరుగుల వద్ద తొలి వికెట్ గా కేఎల్ రాహుల్(32) కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

 

విజయ్ 123 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అర్థ శతకం చేయగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన చటేశ్వర పూజారా 84 బంతుల్లో ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో భారత క్రికెట్ జట్టు 46.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 147 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement