సెంచరీకి చేరువలో విజయ్ | Murali Vijay near to fourth test century | Sakshi
Sakshi News home page

సెంచరీకి చేరువలో విజయ్

Dec 26 2013 8:24 PM | Updated on Sep 2 2017 1:59 AM

సెంచరీకి చేరువలో విజయ్

సెంచరీకి చేరువలో విజయ్

దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య గురువారమిక్కడ ప్రారంభమైన రెండో టెస్టుకు అంతరాయం కలిగింది.

డర్బన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య గురువారమిక్కడ ప్రారంభమైన రెండో టెస్టుకు అంతరాయం కలిగింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట నిలిచిపోయింది. లైట్లను సరి చేసేందుకు మైదాన సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆట ఆగిపోయే సమయానికి భారత్ 181/1 స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమింయా 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్(29) మరోసారి విఫలమయ్యాడు. మురళీ విజయ్, పూజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అర్థ సెంచరీలతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. విజయ్ 91, పూజారా 58 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. విజయ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఉన్నాడు. సెంచరీ పూర్తి చేస్తే టెస్టుల్లో అతడికిది నాలుగోది అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement