
కోల్‌కతాపై ముంబై గెలుపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.
ముంబై:
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మనీష్ పాండే మెరుపులు మెరిపించి ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు.
179 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఓపెనర్లు పటేల్, బట్లర్లు తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రానా 50(29)ఆకట్టుకున్నాడు. చివర్లో హర్దిక్ పాండ్యా బ్యాట్ ఝళిపించడంతో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.