పేస్ రాకెట్స్‌కు రూ.లక్షన్నర | MS Dhoni's kits fetch Rs one lakh, Rs 1.5 lakh for Leander Paes | Sakshi
Sakshi News home page

పేస్ రాకెట్స్‌కు రూ.లక్షన్నర

Jun 14 2016 12:23 AM | Updated on Sep 4 2017 2:23 AM

పేస్ రాకెట్స్‌కు రూ.లక్షన్నర

పేస్ రాకెట్స్‌కు రూ.లక్షన్నర

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు చెందిన రాకెట్స్‌కు వేలంలో రూ. లక్షా 50 వేలు పలికాయి.

కోల్‌కతా: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు చెందిన రాకెట్స్‌కు వేలంలో రూ. లక్షా 50 వేలు పలికాయి. అలాగే భారత వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని కీపింగ్ గ్లోవ్స్, ప్యాడ్స్ రూ. లక్షకు.. పీలే సంతకం చేసిన ఫుట్‌బాల్ రూ.లక్షా 10 వేలకు అమ్ముడుపోయాయి. వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకునేందుకు వాడిన పేస్ రాకెట్స్‌ను బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారి కొనుగోలు చేశాడు.

క్రీడా వెబ్‌సైట్ ఎక్స్‌ట్రాటైమ్.ఇన్ నిర్వహించిన ఈ వేలం మోహన్ బగాన్ వీరాభిమాని, లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాపి మజీ, ఈస్ట్ బెంగాల్ మద్దతుదారు దివంగత అలిప్ చ క్రవర్తి కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం జరిగింది. ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి, అజింక్య రహానే జెర్సీలను కూడా అభిమానులు కొనుగోలు చేశారు. ఓవరాల్‌గా వేలం ద్వారా సమకూరిన రూ.14 లక్షల మొత్తాన్ని ఇరు కుటుంబాలకు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement