అందువల్లే ఓడిపోయాం: మోర్గాన్‌

Morgan laments batting collapse - Sakshi

బ‍్రిస్టల్‌: స్వదేశంలో టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోవడంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ప్రధానంగా నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తమ జట్టు మరిన్ని పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోవడంతో సిరీస్‌ ఓటమికి కారణంగా మోర్గాన్‌ పేర్కొన్నాడు. డెత్‌ ఓవర్లలో తమ బ్యాటింగ్‌ ఆశాజనకంగా సాగలేదని, వరుసగా వికెట్లు చేజార్చుకుని భారీ స్కోరును బోర్డుపై ఉంచలేకపోయామన్నాడు.

మరో 20 నుంచి 30 పరుగులు చేస్తే ఫలితం మరో రకంగా ఉండేదన్నాడు. అదే సమయంలో లక్ష్య ఛేదనలో టీమిండియా ఆడిన తీరును మోర్గాన్‌ ప్రశంసించాడు. టీమిండియా వికెట్లను సాధించడంలో తాము వైఫల్యం చెందడం కూడా మ్యాచ్‌ కోల్పోవడానికి ఒక కారణంగా పేర్కొన్నాడు. టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా  చెలరేగి బ్యాటింగ్‌ చేయడంతో తమ విజయాకాశాలన్ని దారుణంగా దెబ్బతీసిందన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top