చెన్నై: భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (1), అలెస్టర్ కుక్(10)ఆదిలోనే నిష్క్రమించగా, జో రూట్(88), బెయిర్ స్టో(49)లు రాణించారు.
వీరిద్దరూ మూడో వికెట్ కు 146 పరుగులు జోడించిన తరువాత రూట్ అవుటయ్యాడు. ఆ తరువాత మొయిన్ అలీతో కలిసి స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ జోడి 86 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత స్టో అవుటయ్యాడు. ఆపై మొయిన్ అలీ శతకం నమోదు చేసి జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు. ఆట ముగిసే సమయానికి అలీ(120 బ్యాటింగ్), స్టోక్స్(5 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు.భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మకు వికెట్ లభించింది.
కుక్ రికార్డు..
ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. చివరిదైన ఐదో టెస్టులో కుక్ 11వేల పరుగుల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫార్మాట్లో తక్కువ సమయంలో పదకొండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి రికార్డు సృష్టించాడు. అంతకుముందు టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని ఇంత త్వరగా చేరుకున్న ఆటగాడు లేడు.
ఈ మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు చేయడం ద్వారా పదకొండ వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. అయితే ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కుక్ 140 మ్యాచ్‌ల్లో 252 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను సాధించాడు. ఇందులో 30 శతకాలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ఏడాది మేలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫాస్టెస్ట్ పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ 31 ఏళ్ల 4 నెలల వయసులోనే ఆ మార్కును చేరాడు.
మొయిన్ అలీ అజేయ శతకం
Published Fri, Dec 16 2016 4:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement