మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం | mithali gets great honour | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం

Sep 18 2017 10:47 AM | Updated on Sep 19 2017 4:44 PM

మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం

మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు శనివారం రాత్రి ఘన సన్మానం జరిగింది.

హైదరాబాద్‌: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు శనివారం రాత్రి ఘన సన్మానం జరిగింది. మాజీ రంజీ క్రికెటర్‌ రాజేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బేగంబజార్‌లోని మాన్‌సింగ్‌ హోటల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మిథాలీ రాజ్‌తో పాటు నగరానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను కూడా సత్కరించారు.

 

దినేశ్‌ మాన్‌సింగ్‌ మిథాలీ రాజ్‌కు వెండి బ్యాట్‌ను బహుకరించగా, నక్మల్‌ గెహ్లాట్‌ ఆమెకు బంగారు గొలుసును అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్, కోచ్‌ ఆర్‌. మూర్తి, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్‌ మనోజ్, అంతర్జాతీయ బాడీబిల్డర్‌ మోతేషామ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.   


 

Advertisement
 
Advertisement
Advertisement