దక్షిణాఫ్రికాతో సిరీస్కు స్టార్క్ దూరం | Mitchell Starc to miss south africa series | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాతో సిరీస్కు స్టార్క్ దూరం

Sep 2 2016 2:18 PM | Updated on Sep 4 2017 12:01 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్కు స్టార్క్ దూరం

దక్షిణాఫ్రికాతో సిరీస్కు స్టార్క్ దూరం

ఈ నెల చివర్లో దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, హజల్వుడ్లు దూరం కానున్నారు.

సిడ్నీ: ఈ నెల చివర్లో దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, హజల్వుడ్లు దూరం కానున్నారు. ఆ ఇద్దరి ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా స్పష్టం చేసింది. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో స్టార్క్, హజల్ వుడ్లపై భారం ఎక్కువ పడటంతో వారిద్దరికీ విశ్రాంతి అవసరమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్ తమకు ముఖ్యమైనప్పటికీ, స్టార్క్, హజల్వుడ్లకు కాస్త బ్రేక్ ఇవ్వడానికి ఇదే తగిన సమయమన్నాడు. దాంతో గాయపడి తమ ఫిట్నెస్ను నిరూపించుకున్న పలువురు బౌలర్లకు ఇదీ సువర్ణవకాశమన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో గాయపడిన కౌల్టర్ నైల్ తిరిగి జట్టులో చేరుతున్నట్లు మార్ష్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement