జ్యోత్స్నకు పసిడి | Mini national Archery Championship | Sakshi
Sakshi News home page

జ్యోత్స్నకు పసిడి

Apr 12 2014 12:52 AM | Updated on Sep 2 2017 5:54 AM

జ్యోత్స్నకు పసిడి

జ్యోత్స్నకు పసిడి

జాతీయ అండర్-14 మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ఆర్చర్ కె.జ్యోత్స్న (ఓల్గా ఆర్చరీ అకాడమీ) కాంపౌండ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

జాతీయ అండర్-14 ఆర్చరీ
 
 విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జాతీయ అండర్-14 మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ఆర్చర్ కె.జ్యోత్స్న (ఓల్గా ఆర్చరీ అకాడమీ) కాంపౌండ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈవెంట్‌లో ఆమె 139 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.

బాలుర వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌లో రాష్ట్ర ఆర్చర్ ఎం.చరిత్ (ఓల్గా ఆర్చరీ అకాడమీ) రజత పతకం నెగ్గాడు. రికర్వ్‌లో బొమ్మదేవర ధీరజ్ (ఓల్గా ఆర్చరీ అకాడమీ) 30, 20 మీటర్ల విభాగంలో స్వర్ణపతకాలు సాధించాడు. బాలికల విభాగంలో బీఎం రిత్విక ప్రజ్ఞ కాంస్య పతకం సాధించింది. ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో నిజామాబాద్‌కు చెందిన బి.నవ్యశ్రీ 30 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం కైవసం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement