సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా స్విమ్మర్లు పతకాల పంట పండించారు. పురుషుల విభాగంలో మైలారి సుహాస్ ప్రీతమ్, ధూళిపుడి వర్షిత్... జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్... మహిళల విభాగంలో వ్రిత్తి అగర్వాల్, శ్రీనిత్య సాగి పతకాల మోత మోగించారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో సుహాస్ ప్రీతమ్, ధూళిపుడి వర్షిత్ నాలుగు స్వర్ణ పతకాల చొప్పున నెగ్గగా... జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ మూడు బంగారు పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్, శ్రీనిత్య మూడు బంగారు పతకాల చొప్పున సొంతం చేసుకున్నారు. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి.
మహిళల విభాగం (ఫ్రీస్టయిల్): 50 మీటర్లు: 1. సు«దీక్ష కృష్ణ (మేడ్చల్–మల్కాజిగిరి; 27.36 సెకన్లు), 2. జొహన్నా షిజు (రంగారెడ్డి), 3. హేమ వర్షిణి జంబులూరి (మేడ్చల్–మల్కాజిగిరి). 100 మీటర్లు: 1. మండూరి ప్రీతిక (రంగారెడ్డి; 1ని:06.95 సెకన్లు), 2. హేమ వర్షిణి జంబులూరి, 3. అవిశా రాచెల్ (హైదరాబాద్). 200 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (మేడ్చల్–మల్కాజిగిరి; 2ని:12.76 సెకన్లు), 2. కర్రా శివాని (రంగారెడ్డి), 3. జొహన్నా షిజు. 400 మీటర్లు:
1. వ్రిత్తి అగర్వాల్ (4ని:40.32 సెకన్లు), 2. కర్రా శివాని, 3. జొహన్నా షిజు. 800 మీటర్లు: 1. వ్రిత్తి అగర్వాల్ (9ని:47.14 సెకన్లు), 2. జొహన్నా షిజు, 3. మండూరి ప్రీతిక. 1500 మీటర్లు: 1. మెరుపుల లిఖిత గౌడ్ (మేడ్చల్–మల్కాజిగిరి; 21ని:10.42 సెకన్లు), 2. నుహా ఫాతిమా (హైదరాబాద్).
బ్యాక్‌స్ట్రోక్: 50 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (మేడ్చల్–మల్కాజిగిరి; 32.36 సెకన్లు), 2. నాదెళ్ల అదితి (హైదరాబాద్), 3. కర్రా శివాని. 100 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (1ని:09.31 సెకన్లు), 2. కర్రా శివాని, 3. ఇషి అగర్వాల్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. శ్రీనిత్య సాగి (2ని:27.42 సెకన్లు), 2. అనిక దెబోరా (మేడ్చల్–మల్కాజిగిరి), 3. కర్రా శివాని.
బ్రెస్ట్‌స్ట్రోక్: 100 మీటర్లు: 1. జొహన్నా షిజు (1ని:24.83 సెకన్లు), 2. గిడిజల దాక్షిణ్య హరిణి (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఫాతిమా మెహ్రీన్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. గిడిజల దాక్షిణ్య హరిణి (3ని:03.48 సెకన్లు), 2. ఫాతిమా మెహ్రీన్, 3. పుట్టా సుష్మ (వరంగల్).
బటర్‌ఫ్లయ్: 50 మీటర్లు: 1. సుదీక్ష కృష్ణ (29.57 సెకన్లు), 2. అద్దంకి మోక్షిత (హైదరాబాద్), 3. నాదెళ్ల అదితి. 100 మీటర్లు: 1. అద్దంకి మోక్షిత (1ని:19.96 సెకన్లు),
2. మేఘన అబినేశ్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. మెరుపుల లిఖిత గౌడ్ (2ని:49.89 సెకన్లు), 2. అద్దంకి మోక్షిత.
వ్యక్తిగత మెడ్లీ: 200 మీటర్లు: 1. జొహన్నా షిజు (రంగారెడ్డి; 2ని:46.07 సెకన్లు), 2. భూపతిరాజు హర్షిత వర్మ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. జంబులూరి హేమ వర్షిణి. 400 మీటర్లు: 1. జంబులూరి హేమ వర్షిణి (మేడ్చల్–మల్కాజిగిరి; 6ని:03.31 సెకన్లు), 2. మేఘన అబినేశ్.
పురుషుల విభాగం (ఫ్రీస్టయిల్): 50 మీటర్లు: 1. కాసుల తన్మయ్ రిత్విక్ (రంగారెడ్డి; 25.21 సెకన్లు), 2. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (హైదరాబాద్), 3. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు (మేడ్చల్–మల్కాజిగిరి). 100 మీటర్లు: 1. కాసుల తన్మయ్ రిత్విక్ (రంగారెడ్డి; 55.90 సెకన్లు), 2. మైలారి సుహాస్ ప్రీతమ్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఎడక్కొలాతుర్ స్టాష్ జోసెఫ్ (మేడ్చల్–మల్కాజిగిరి). 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (మేడ్చల్–మల్కాజిగిరి; 2ని:07.86 సెకన్లు), 2. స్టాష్ జోసెఫ్, 3. అరుంబక రిత్విక్ కమల్ (రంగారెడ్డి). 400 మీటర్లు: 1. రేవెళ్లి అమోఘ్ (హైదరాబాద్; 4ని:38.55 సెకన్లు), 2. స్టాష్ జోసెఫ్, 3. భట్టిప్రోలు ప్రభాత్ ముత్తుస్వామి (రంగారెడ్డి). 1500 మీటర్లు: 1. బండారి సాయిశ్రీ ప్రణీత్ (హైదరాబాద్; 19ని:54.58 సెకన్లు), 2. జితేశ్ అవిరినేని (రంగారెడ్డి), 3. పెన్మత్స బాల సిద్ధార్థ వర్మ (మేడ్చల్–మల్కాజిగిరి).
బ్యాక్‌స్ట్రోక్: 50 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (27.31 సెకన్లు), 2. సచిన్ సాత్విక్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. సింకా అనీశ్ రెడ్డి (రంగారెడ్డి). 100 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (1ని:01.33 సెకన్లు), 2. లక్కోజు అభయ్ (మేడ్చల్–మల్కాజిగిరి), 3. ఆరుష్ దాస్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (2ని:09.60 సెకన్లు), 2. ధూళిపుడి వర్షిత్.
బ్రెస్ట్‌స్ట్రోక్: 50 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (30.95 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. నూనె యశస్వి. 100 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (1ని:07.99 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. దారా యక్షిత్ (హైదరాబాద్). 200 మీటర్లు: 1. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ (2ని:36.41 సెకన్లు), 2. దారా యక్షిత్, 3. యెర్రం అనుదీప్ రాజ్ (ఆదిలాబాద్).
బటర్‌ఫ్లయ్: 50 మీటర్లు: 1. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు (26.08 సెకన్లు), 2. ఇషాన్ దాస్ (రంగారెడ్డి), 3. లక్కోజు అభయ్. 100 మీటర్లు: 1. మైలారి సుహాస్ ప్రీతమ్ (57.96 సెకన్లు), 2. బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు, 3. టీఎస్ తేజస్ కుమార్ (రంగారెడ్డి). 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (2ని:15.94 సెకన్లు), 2. టీఎస్ తేజస్ కుమార్.
వ్యక్తిగత మెడ్లీ: 200 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (2ని:19. 32 సెకన్లు), 2. జోర్డాన్ డొమినిక్ ఫ్రాంక్లిన్, 3. టీఎస్ తేజస్ కుమార్. 400 మీటర్లు: 1. ధూళిపుడి వర్షిత్ (5ని:16.99 సెకన్లు), 2. బండారి సాయిశ్రీ ప్రణీత్, 3. ఆరుష్ దాస్.


