ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పొలార్డ్ | MI appoint Kieron Pollard as captain for Champions League T20 | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పొలార్డ్

Sep 11 2014 9:06 PM | Updated on Sep 2 2017 1:13 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పొలార్డ్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పొలార్డ్

ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా వెస్టిండీస్ డాషింగ్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ నియమితుడయ్యాడు.

రాయపూర్: ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా వెస్టిండీస్ డాషింగ్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ నియమితుడయ్యాడు. చాంపియన్ లీగ్ టి20లో జట్టుకు అతడు నాయకత్వం వహిస్తాడు. భుజం, చేతివేళ్ల గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో  పొలార్డ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లో లాహోర్ లయన్స్ తో తలపడుతుంది.

శనివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మొహాలీ, రాయ్‌పూర్‌లలో కలిపి మొత్తం 29 మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, ఆ తర్వాత బుధవారం నుంచి ప్రధాన పోటీలు నిర్వహిస్తారు. అక్టోబర్ 4న ఫైనల్ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement