నేడే మహిళల చాలెంజ్‌ మ్యాచ్‌   | Match todays women's challenge | Sakshi
Sakshi News home page

నేడే మహిళల చాలెంజ్‌ మ్యాచ్‌  

May 22 2018 12:37 AM | Updated on May 22 2018 12:37 AM

Match todays women's challenge - Sakshi

హర్మన్‌ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన

ముంబై: మహిళా క్రికెట్‌లో మరో ముందడుగుగా పేర్కొంటున్న తొలి ఐపీఎల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ మంగళవారం వాంఖెడే మైదానంలో జరగనుంది. పురుషుల జట్ల తొలి క్వాలిఫయర్‌కు ముందుగా మధ్యా హ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఐపీఎల్‌ ట్రయల్‌ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్‌నోవాకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనున్నారు.

భారత మేటి క్రీడాకారిణి మిథాలీరాజ్‌... సూపర్‌నోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ స్టార్లు సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌), అలీసా హీలీ, మూనీ, పెర్రీ, షుట్‌ (ఆస్ట్రేలియా), వ్యాట్‌ (ఇంగ్లండ్‌) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement