క్వార్టర్స్‌లో మేరీకోమ్‌  | Mary Kom Reached To Quarter Final In Asian Boxing Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో మేరీకోమ్‌ 

Mar 8 2020 2:18 AM | Updated on Mar 8 2020 2:18 AM

Mary Kom Reached To Quarter Final In Asian Boxing Championship - Sakshi

అమ్మాన్‌ (జోర్డాన్‌): టోక్యో ఒలింపిక్స్‌ ఆసియా బాక్సింగ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి బాక్సర్లు మేరీకోమ్‌ (51 కేజీలు), అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్స్‌లో మేరీకోమ్‌ 5–0తో టాస్మీన్‌ బెన్నీ (న్యూజిలాండ్‌)ను చిత్తుగా ఓడించగా... అమిత్‌ 3–2తో ఎన్క్‌మనాదక్‌ ఖర్కు (మంగోలియా)పై కష్టపడి గెలిచాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో భారత బాక్సర్‌ గౌరవ్‌ సోలంకి (57 కేజీలు) 1–4తో టాప్‌ సీడ్‌ మిరాజిజ్‌బెక్‌ మిర్జాఖలీలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement