ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునెటైడ్ (ఎంయూ) క్లబ్‌ది ప్రత్యేక స్థానం. ఈ క్లబ్ తరఫున శిక్షణ తీసుకోవడం ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమకు దక్కిన అద్భుత అవకాశంగా భావిస్తారు.
కోల్‌కతా: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునెటైడ్ (ఎంయూ) క్లబ్‌ది ప్రత్యేక స్థానం. ఈ క్లబ్ తరఫున శిక్షణ తీసుకోవడం ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమకు దక్కిన అద్భుత అవకాశంగా భావిస్తారు. తాజాగా భారత్ నుంచి ఇద్దరు పేద చిన్నారులు ఈ అదృష్టానికి నోచుకున్నారు. టాలెంట్ హంట్‌లో భాగంగా రాజీవ్ బాయ్, అర్కా డే అనే 16 ఏళ్ల టీనేజర్లు ఎంయూ ఫుట్‌బాల్ క్లబ్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు.
అయితే వీరిద్దరి నేపథ్యం కడు దయనీయంగా ఉండడం గమనార్హం. రాజీవ్ తల్లి వేశ్య వృత్తిలో ఉండగా... అర్కా తండ్రి వీధి వ్యాపారిగా ఉంటూ మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయారు. ‘నా తల్లి వేశ్యా వృత్తిలో ఉందని చెప్పుకోవడానికి సంశయించను. ఎందుకంటే ఆమే నాకు జీవనాధారం. వీలైనంత త్వరగా ఆమెను అందులో నుంచి బయటకు తీసుకురావాలి’ అని రాజీవ్ తెలిపాడు.