సొంతగడ్డపై మెరిసిన హామిల్టన్ | lewis hamilton wins british GP | Sakshi
Sakshi News home page

సొంతగడ్డపై మెరిసిన హామిల్టన్

Jul 5 2015 7:38 PM | Updated on Sep 3 2017 4:57 AM

సొంతగడ్డపై మెరిసిన హామిల్టన్

సొంతగడ్డపై మెరిసిన హామిల్టన్

మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మెరిశాడు.

లండన్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మెరిశాడు. ముచ్చటగా మూడోసారి బ్రిటీష్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో హామిల్టన్ ప్రథమ స్థానం సాధించాడు.

పోల్ పొజిషన్ నుంచి రేసు ఆరంభించిన 30 ఏళ్ల హామిల్టన్ తొలిస్థానంలో నిలవగా, మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్బర్గ్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు నికో హుల్కెన్బర్గ్ ఏడు, సెర్గియో పెరెజ్ తొమ్మిది స్థానాలు సొంతం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement