హామిల్టన్ కు 'పోల్' | Lewis Hamilton took his eleventh pole position | Sakshi
Sakshi News home page

హామిల్టన్ కు 'పోల్'

Sep 5 2015 7:00 PM | Updated on Aug 21 2018 9:00 PM

హామిల్టన్ కు 'పోల్' - Sakshi

హామిల్టన్ కు 'పోల్'

ఈ సీజన్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న మెర్సిడెస్ టీమ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఇటాలియన్ గ్రాండ్ పిక్స్ లో పోల్ పొజిషన్ సాధించాడు.

ఈ సీజన్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న మెర్సిడెస్ టీమ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఇటాలియన్ గ్రాండ్ పిక్స్ లో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫైయింగ్ సెషల్ లో అందరి కంటే వేగంగా..  ల్యాప్ ను పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఆదివారం జరిగే రేస్ లో అతను తొలి స్ధానం నుంచి ఆరంభిస్తాడు. కాగా.. ఫెరారీ  రెండు మూడు స్థానాలు కైవశం చేసుకుంది. కిమి రైకొనెన్ సెకండ్ ప్లేస్ సాధించగా.. ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. హామిల్టన్ కు ఈ ఏడాది జరిగిన 12 రేసుల్లో 11వ సారి పోల్ పొజిషన్ సాధించాడు. ఇక మెర్సిడెజ్ మరో డ్రైవర్ రోస్ బెర్గ్ నాలుగో స్ధానానికే పరిమితమయ్యాడు.  మరో వైపు హామిల్టన్ సాధించిన ఈ ఫీట్ తో అతని టీమ్ మెర్సిడెజ్.. 1992-93 సీజన్ లో విలియమ్స్ జట్టు క్రియేట్ చేసిన రికార్డుకు అడుగు దూరంలో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement